Thursday, May 2, 2024

మాస్కు పెట్టుకోండి.. బైక్ కి మాత్రం కాదు..

బైకుల‌పై మోజుతో సిటీ రోడ్ల‌పై దూసుకెళ్లే యువ‌త‌కు పోలీసులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. కొంత‌మంది కావాల‌ని బండి నెంబ‌ర్ ప్లేట్స్‌ని మూసివేసి రోడ్ల‌పై రూల్స్ బ్రేక్స్ చేస్తూ వెళ్తున్నార‌ని. అయినా వారిని ట్రేస్ చేసి యాక్ష‌న్ తీసుకుంటామ‌ని చెబుతున్నారు. అయితే.. బైక్ పై వెళ్తున్న వ్య‌క్తి బ్యాక్ సైడ్ నెంబ‌ర్ క‌నిపించ‌కుండా మాస్క్‌ని అడ్డుగా పెట్టాడు. ఈ ఫొటోని ట్విట్ట‌ర్లో షేర్ చేశారు సిటీ పోలీసులు.

దీనికి వారి వైద్య భాష‌లో చెబుతూ.. న్యూ వేరియంట్ పేషెంట్స్ ని ప్ర‌త్యేకంగా ట్రీట్ చేస్తాం.. ఐపీసీ సెక్ల‌న్ల ప్ర‌కారం వారిని త‌గిన బుద్ధి చెబుతాం అని ట్వీట్ చేశారు. కాగా ఈ బైక్‌పై వెళ్తున్న వ్య‌క్తి క‌నీసం హెల్మెట్ పెట్టుకోక‌పోవ‌డంతో పాటు ఇట్లా నెంబ‌ర్ ప్లేట్ క‌నిపించ‌డ‌కుండా ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డ‌డ‌మే దీనికి కార‌ణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement