Friday, April 19, 2024

రోడ్డుపై వడ్లుపోసి.. రైతుల రాస్తారోకో..

వెంకటాపురం, ప్రభ న్యూస్ : ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండల కేంద్రంలో రైతులను నిలువునా దోపిడీ చేస్తున్న మిల్లర్ల పై చర్యలు తీసుకొని.. తమకు న్యాయం చేయాలని రైతులు రాస్తారోకో నిర్వహించారు దీంతో వెంకటాపురం వాజేడు మండలాలకు రాకపోకలు నిలిచిపోవ‌డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు విషయంలో తరుగు పేరుతో క్వింటాకు 10 నుండి 12 కేజీల వరకు కోతలు పెట్టడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

అసలే పంట దిగుబడి రాక నష్టపోయిన రైతులకు ములిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తరుగు పేరుతో మరింత నష్టం వాటిల్లుతుందని సంబంధిత అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని న్యాయం చేయాలని నినాదాలు చేశారు సుమారు గంట పాటు ఆందోళన కార్యక్రమం నిర్వహించగా సమాచారం తెలుసుకున్న వెంకటాపురం తహశీల్దార్ అంటి నాగరాజు వెంకటాపురం ఎస్ ఐ (2) కాన్ సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement