Saturday, July 27, 2024

జూన్‌ మొదటి వారం కల్లా వ‌డ్ల కొనుగోళ్లు పూర్తి.. ప్లాన్ చేస్తున్న‌ పౌరసరఫరాల శాఖ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యాసంగి ధాన్యం కొనుగోళ్లు జూన్‌ మొదటి వారం నాటికి పూర్తికానున్నాయి. జూన్‌ 10 నాటికి అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేలా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు పూర్తి చేసింది. ప్రస్తుతం వర్షాకాలం ముందే కరుణించే పరిస్థితులు ఉండడంతో కల్లాలకు వచ్చిన ధాన్యం ఎప్పటికప్పుడు వేగంగా కొనుగోళ్లు జరిగేలా జిల్లా అదనపు కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ప్రతి కొనుగోలు కేంద్రాన్ని నిరంతరం సందర్శిస్తున్నాయి. మిల్లర్లు సమపస్యలు సృష్టించుకుండా చూడటంతోపాటు కొనుగోలు చేసిన ధాన్యం కేంద్రాల్లో నిల్వ ఉండకుండా తరలించే బాధ్యతలను ఆయా మండలాల డిప్యూటీ తహసిల్దార్లకు అప్పగించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 12 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 35లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా… 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేశారు. ఆ మేరకు ఇప్పటికే 30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దాదాపు 4లక్షల మంది రైతుల నుంచి ఈ ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటి వరకు రూ.4800 కోట్ల మేర చెల్లింపులు పూర్తయ్యాయి. ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన రైతుల ఖాతాల్లో 3 రోజుల్లోగా నగదును కూడా జమ చేస్తున్నారు. కాగా… ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న 60లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంలో కాస్త తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ, పౌరసరఫరాల వాఖలు అంచనా వేస్తున్నాయి. దాదాపు 5లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యాన్ని ప్రయివేటు, ఇతర సీడ్‌ కంపెనీలకు రైతులు అమ్మినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement