Thursday, May 2, 2024

HighCourt: శిరీష (బర్రెలక్క)కు గన్ మెన్ తో భద్రత కల్పించండి.. హైకోర్టు

తెలంగాణ హైకోర్టులో శిరీష (బర్రెలక్క)కు ఊరట కలిగింది. ఆమెకు భద్రత కల్పించాలని హైకోర్టు ధర్మాసనం పోలీసు శాఖను ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఒక గన్ మెన్‌తో ప్రొటెక్షన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీలకే కాదు.. స్వతంత్ర్య అభ్యర్థులకు కూడా భద్రత కల్పించాల్సిందేనని తేల్చిచెప్పింది.

కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష తనకు భద్రత కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల ప్రచారంలో తన సోదరుడిపై దాడి జరగడంతో సెక్యూరిటీ అభ్యర్థించారు. అయితే, పోలీసులు తన విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టుకెక్కారు. తనకు రక్షణ కల్పించాలని.. ఎన్నికలయ్యే వరకూ 2 ప్లస్ 2 గన్‌మెన్‌లను కేటాయించాలని కోరుతూ శిరీష రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు భద్రత కల్పించాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement