Friday, May 3, 2024

TS: ప్రతి ఇంటికో పథకం.. అది సీఎం కేసీఆర్ ఘనత.. నామా

చంద్రుగొండ, నవంబర్ 3 (ప్రభ న్యూస్): ప్రతి ఇంటికో పథకంతో అన్ని కుటుంబాలకు చేయూతనిచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం లక్ష గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏదో ఒక పథకం ప్రతి కుటుంబానికి అందేవిధంగా పాలన అందిస్తూ ప్రధానంగా రైతులకు వెన్నుదన్నుగా ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ దేనని ఆయన అన్నారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో మరోమారు విజయ ఢంకా మోగించి సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించనున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ఉప్పల వెంకటరమణ, చంద్రుగొండ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement