Tuesday, June 18, 2024

Political Strategy – ‘ఆగే’… ‘పీచే’ ..మూడ్ నేత‌ల వ్యూహం..

రాజకీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా దూకుడు
పరిస్థితులను బట్టి మనసు మార్చుకుంటున్న నేతలు
తెలంగాణాలో సరికొత్త రాజకీయ సమీకరణాలు
అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న పార్టీలు
నియోజకవర్గ స్థాయికి వ్యూహాలు, ప్రణాళికలు
గతానికి భిన్నంగా నేతల ఆలోచనలు, సమాలోచనలు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మూడు జాతీయ పార్టీలు అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఈ మూడు పార్టీల వ్యూహాలు, ప్రణాళికలు ఇప్పటికే నియోజకవర్గ స్థాయికి చేరుకున్నాయి. తామేమీ తక్కువ కాదన్న సంకేతాలిస్తూ వామపక్ష పార్టీలు సైతం ఈసారి ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు సంసిద్ధమవుతున్నాయి. పార్టీల సిద్ధాంతాలు, నైతిక విలువలు, లక్ష్యాలను పక్కనపెడితే.. గతానికి పూర్తి భిన్నంగా ఈసారి ఎన్నికల్లో నాయకుల ఆలోచనలు, సమాలోచనలు మారుతున్నాయి. రాజకీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా దూకుడుకు సిద్ధపడుతున్నారు. కొంతమంది కీలక నాయకులు వ్యక్త్తిగత అజెండాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. టిక్కెట్లు ఆశిస్తున్న క్రమంలో రాష్ట్ర స్థాయి మొదలుకుని నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు.. అన్నట్లుగా పార్టీలు మారే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఎటు వైపు దూకితే.. పరిస్థితులు తమకు అనుకూలంగా మారోతాయోనన్న కోణంలో కొత్త ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల నుంచి రంగంలోకి దిగిన జాతీయ నాయకుల పాత్ర అత్యంత క్రియాశీలకంగా కనిపిస్తోంది. అటూ, ఇటూ కాకుండా ఆలోచనలో పడ్డ నాయకుల మూడ్‌ మార్చేస్తూ.. తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

2018 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో జట్టు-కట్టిన పార్టీలు ఇప్పుడు కొత్త మిత్రులను వెతుక్కుంటు-న్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని వచ్చే ఎన్నికలు రుజువు చేసేలా కనిపిస్తున్నాయి. ఇటీ-వల ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లిన టీ-డీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డాలతో ఏకాంతంగా సమావేశమై చర్చలు జరపడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ రెండు పార్టీల నేతలు ఏం మాట్లాడారో? ఏ అంశాలు చర్చకు వచ్చాయో? వివరాలు ఏమాత్రం బయటకు రాలేకపోయినప్పటికీ పొత్తులుంటాయన్న సంకేతాలు అప్పుడే ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. మునుగోడు ఉపఎన్నిక తర్వాత కమ్యూనిస్టులతో బీఆర్‌ఎస్‌ బంధం బలపడింది. అదే కొనసాగుతుందా..? లేక పొత్తుపొడుపులో ఇంకేమైనా జరుగుతుందా అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో సందిగ్ధంగా మారింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ చతికిలపడినా.. గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోయినా.. ఈదఫా మాత్రం అధికారంలోకి వచ్చేది తామేనని ఘంటాపథంగా చెబుతున్నారు.

‘కమలం’.. ఆపరేషన్‌ మిషన్‌ సౌత్‌
కమలం పార్టీ.. ‘ఆపరేషన్‌ మిషన్‌ సౌత్‌’ వ్యూహాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. కర్నాటక ఎన్నికల తర్వాత.. ఇక తెలంగాణ నుంచే దండయాత్ర మొదలు పెట్టాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది.

- Advertisement -

ఖమ్మం ఖిల్లాపై కన్నేసిన జాతీయ పార్టీలు!
ఈ తరుణంలో అన్ని పార్టీలు ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాపై ఫోకస్‌ పెంచడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు- ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సత్తా చాటాలని ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీ-వల బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయడంతో జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆయన ఏ పార్టీలో చేరనప్పటికీ.. వరుస పర్యటనలు చేస్తూ రాజకీయాలను హీ-టె-క్కిస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

పోటాపోటీగా సమావేశాలకు సన్నద్ధం
బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, లెప్ట్‌n పార్టీలు సైతం ఉమ్మడి జిల్లాలో వరుస పర్యటనలు చేస్తూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వైపు బీఆర్‌ఎస్‌.. మరోవైపు కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం.. ఖమ్మం దృష్టి సారించగా.. అదేరీతిలో బీజేపీ సైతం ఖమ్మంపై కన్నేసింది.. దీంతో ఖమ్మం రాజకీయాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో అన్ని జాతీయ పార్టీలు ఖమ్మం గుమ్మంలో సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాయి. ఈ నెలలోనే కాంగ్రెస్‌, బీజేపీ అగ్రనేతలు సైతం ఖమ్మానికి రానున్నారు.

బల నిరూపణకు సిద్ధమవుతున్న వామపక్ష పార్టీలు
తామేమీ తక్కువ కాదన్న కోణంలో వామపక్ష పార్టీలు సైతం బల నిరూపణకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 11న కొత్తగూడెంలో సీపీఐ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు జాతీయ నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే.. కొత్తగూడెం నుంచి పోటీ- చేస్తున్నట్లు- సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. 2009లో కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన కూనంనేని.. వచ్చే ఎన్నికల్లో పోటీ- చేస్తానని ప్రకటించడం.. అటు- సీపీఎం పార్టీ సైతం పోటీ-కి సిద్ధమవుతుండటం రాజకీయాలను మరింత హీ-టె-క్కిస్తోంది. అయితే.. ప్రస్తుతం సీపీఐ, సీపీఎం బీఆర్‌ఎస్‌తో సఖ్యతగా ఉన్నాయి.. లెప్ట్‌n పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళితే.. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ లెప్ట్‌n పార్టీలకు సీట్లు- ఇస్తుందా..? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే, ఇప్పటికే లెప్ట్‌n పార్టీల నాయకులు సీట్లపై సీఎం కేసీఆర్‌తో చర్చించినట్లు- సమాచారం.. లెప్ట్‌n పార్టీల ప్రాబల్యం ఉన్న ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ వాటితో జోడి కట్టి అన్ని సీట్లను -కై-వసం చేసుకోవాలని ప్లాన్‌ రచించినట్లు- తెలుస్తోంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం కేంద్ర బిందువుగా మారుతుండటం.. అన్ని పార్టీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఫోకస్‌ పెంచడం.. ఇప్పుడు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అవుతోంది.

అనుచరులతో సహా కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి..?
కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. పొంగులేటిది ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితే.. జూపల్లిది ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా. ఈ చర్చకు ఎట్టకేలకు ముగింపు పలికే అంశం తెరపైకి వచ్చింది. ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు. వీరి చేరికకు కాంగ్రెస్‌లో లైన్‌ క్లియర్‌ అయ్యిందనే చర్చ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ఫైనల్‌ టచ్‌గా.. రంగంలోకి రాహుల్‌ గాంధీ
బీజేపీ నేతల కంటే ముందుగానే కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. పొంగులేటి, జూపల్లితో రాహుల్‌గాంధీ టీ-మ్‌ రహస్యంగా సమావేశమై చర్చించింది. తెలంగాణ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్‌ నేతలూ తమ వంతు ప్రయత్నం చేశారు. పొంగులేటి, జూపల్లి చేరడమే కాకుండా తమ అనుచరులకు కూడా టికెట్స్‌ ఇవ్వాలన్నది మొదటి నుంచీ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ షరతులకు రాహుల్‌ గాంధీ టీ-మ్‌ నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు- తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement