Saturday, October 12, 2024

TS: మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు

మనోహరబాద్, ప్రభ న్యూస్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ 44వ వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో హైదరాబాద్ నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న మంత్రి కేటీఆర్ వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీ చేపట్టారు. బుధవారం పార్టీ కార్యక్రమాలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుండి కామారెడ్డిలో పలు పార్టీ కార్యక్రమాలకు వెళ్తుండగా మార్గమధ్యలోని 44వ జాతీయ రహదారి కాళ్లకల్ గ్రామ శివారులోని ఎస్బిఐ బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసుల తనిఖీ చెక్పోస్ట్ లో టిఎస్ 09పి ఏ 3293 గల వాహనంలో కేటీఆర్ ప్రయాణించడంతో పోలీసులు, ఎన్నికల సిబ్బంది మంత్రి కేటీఆర్ వాహనాన్ని ఆపి పోలీసులు చేపట్టారు.

తనిఖీలో భాగంగా మంత్రి కేటీఆర్ తనికి పూర్తిగా సహకరించారని మనోహరాబాద్ ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలాగే పోలీసులు నిజాయితీగా తమ విధులకు హాజరై ప్రజా శ్రేయస్సు కోసం తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారని తనిఖీ చేసిన పోలీసులను కేటీఆర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement