Tuesday, April 30, 2024

AP: వంతెనపై ఇరుక్కున్న కార్ల కంటైనర్.. 5గంటలుగా వాహనదారుల అవస్థలు

పాలకోడేరు, (ప్రభన్యూస్) : నిత్యం వాహనదారులతో, భారీ వాహనాలతో రద్దీగా ఉండే భీమవరం -తాడేపల్లిగూడెం మార్గంలో గరగపర్రు వంతెన టర్నింగ్ లో ఓ కార్ల కంటైనర్ ఇరుక్కుంది. ఈ వంతెన ప్రాంతంలోకి బుధవారం ఉదయం 11గంటల సమయంలో కంటైనర్ నిలిచిపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వెనుదిరిగి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గతంలో కూడా ఇలాగే ఈ కార్ల కంటైనర్ ఇరుక్కోవడంతో ఈ మార్గంలో వీటిని తీసుకురావద్దంటూ స్థానికులు, అధికారులు హెచ్చరించినా తిరిగి ఇదే మార్గంలో ప్రయాణించడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది.

తాడేపల్లిగూడెం హైవే నుంచి గరగపర్రు మీదుగా భీమవరంలోని ఒక కార్ల కంపెనీకి వెళ్లాల్సిన కంటైనర్ గరగపర్రు వద్ద ఇరుక్కోవడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తరచూ ఈ కంటైనర్ లారీల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవడంతో వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మార్గంలో ఈ కార్ల కంటైనర్లు పొడవు ఎక్కువగా ఉండటంతో గరగపర్రు వంతెన మలుపు ఇరుకుగా ఉండటంతో ఈ వంతెన మలుపు తిరిగే సమయంలో కంటైనర్ లారీలు ఇరుక్కుంటున్నాయి. ఇటువంటి పరిస్థితులు తరచూ తలెత్తుతున్నాయని తెలిసినా కూడా ఇటువైపే వీటిని మళ్ళించడం వాహణదారులని ఇబ్బందులకు గురిచేయడం సరికాదు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement