Sunday, May 12, 2024

TS : రాడిస‌న్ హోట‌ల్ పై పోలీసుల దాడి.. డ్ర‌గ్స్ తీసుకున్న యువ‌కుల అరెస్టు..

హైద‌రాబాద్ న‌గ‌రంలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. న‌గ‌రంలో పోలీసులు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టిన డ్ర‌గ్స్ తీసుకోవ‌డం త‌గ్గ‌డం లేదు. ఎన్ని విధాలుగా డ్రగ్స్ అరికట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. తాజా ఇవాళ గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

యువకులందరూ రాడిసన్ హోటల్‌లో ఘనంగా పార్టీ చేసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు. అక్కడ యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యువకులను పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement