Sunday, April 28, 2024

Plasma Mafia – బ్లడ్ బ్యాంకులపై డ్రగ్‌ కంట్రోల్ దాడులు – ప్లాస్మా అమ్మకాల ముఠా అరెస్ట్

హైదరాబాద్‌లో వివిధ బ్లడ్ బ్యాంకులలో డ్రగ్‌ కంట్రోల్ దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో.. హ్యూమన్‌ ప్లాస్మా అమ్మకాల ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు..ఈ మేరకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఒక ప్రకటన విడుదల చేశారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్‌.ఆర్‌ బ్లడ్ బ్యాంక్‌లో సోదాలు చేపట్టారు. హ్యూమన్‌ ప్లాస్మాలను అక్రమంగా అమ్ముతున్న ముఠాను గుర్తించారు.

దీంతో భారీగా ప్లాస్మా యూనిట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. క్లిమెన్స్‌, క్లినోవి రీసెర్చ్‌, నవరీచ్ క్లినిక్‌, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్‌ బయోసర్వీస్‌లో తనిఖీలు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. శిల్ప మెడికల్, జెనీరైస్ క్లినిక్‌, వింప్టా ల్యాబ్స్‌లోనూ డ్రగ్ అధికారుల సోదాలు చేపట్టారు. భారీగా అక్రమ నిల్వలు, అపరిశుభ్రమైన హ్యూమన్ బ్లడ్, ప్లాస్మా యూనిట్స్ పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు.. మూసాపేటలో రక్తంలోని ప్లాస్మా అక్రమంగా విక్రయిస్తున్న హేమో సర్వీస్ లాబొరేటరీస్ అనే సంస్థ పై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడి చేశారు. కాగా.. అక్రమంగా రక్తం, ప్లాస్మా, సీరం విక్రయిస్తున్న ఆర్.రాఘవేంద్ర నాయక్ అనే వ్యక్తి పై కేసు నమోదు చేశారు. ఆర్.రాఘవేంద్ర నాయక్ 2016లో మూసాపేట భవాని నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అక్రమంగా బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి పలు బ్లడ్ బ్యాంకుల నుండి 700 నుండి 1000 రూపాయలకు రక్తము సేకరించి, వాటి నుండి రక్తము, ప్లాస్మా, సీరం వేరు చేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ఈ బ్లడ్ బ్యాంక్ పై పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఈ రోజు దాడి చేశారు. బ్లడ్ బ్యాంకుకు అనుమతులు లేకపోవటమే కాకుండా నిట్ నేస్ లేని పరిసరాల్లో రక్తాన్ని వేరు చేసిన ప్లాస్మా బ్యాగులు, రక్తం బ్యాగులు, ఫ్రిడ్జ్ లో నిలువ ఉంచిన రక్తం, సీరం, ప్లాస్మాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాఘవేంద్ర పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement