Friday, May 3, 2024

40లక్షల మొక్కలు నాటేందుకు ప్లాన్​.. ఎంపీ సంతోష్​కు బ్రహ్మ కుమారీస్ ఆహ్వానం

ఆధ్యాత్మికత, యోగా రంగాల్లో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింన బ్రహ్మా కుమారీ సమాజం నుంచి టీఆర్​ ఎస్​ ఎంపీ జోగినిపల్లి సంతోష్​కుమార్​కు ఆహ్వానం అందింది. యోగా,వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలను బోధించే బ్రహ్మకుమారీలు.. 50 వ “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా మొక్కలు నాటాలనే సంకల్పంతో “కల్ప తరు” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం కులషితమై మనిషి మనుగడ ప్రశ్నర్ధకంగా మారిందనే ఆవేదన.. మొక్కలు నాటడం మాత్రమే ఈ సృష్టిని కాపాడగలవనే నమ్మకంతో బ్రహ్మకుమారీ సమాజం “కల్ప తరు” పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నామని వారు తెలిపారు.

కాగా, గచ్చిబౌలీలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ లో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక కార్యమానికి ముఖ్య అతిథిగా “గ్రీన్ ఇండియా చాలెంజ్” ముఖ్యుడు, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు వారు తెలిపారు. జూన్ 5వ తేదీ నుండి ఆగస్టు 25 వరకు జరగనున్న “కల్పతురు క్యాంపెయిన్” క్యాంపెన్ ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని బ్రహ్మకుమారీస్ సెంటర్ల తరపున 40లక్షల మందితో కనీసం 40 లక్షల మొక్కలు నాటేందుకు కృషి చేస్తున్నట్లు బ్రహ్మకుమారీలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement