Sunday, May 5, 2024

Pirzadiguda -: చైతన్య జూనియర్ కళాశాల హాస్టల్ లో విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పీర్జాదిగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బాత్ రూమ్‌లో చున్నితో ఉరి వేసుకున్న విద్యార్థినిని కళాశాల సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఆత్మహత్య చేసుకుందా? మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement