Friday, April 19, 2024

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిలో దేశంలో మనమే నెంబర్ వన్

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిలో దేశంలో మనమే నెంబర్ వన్ అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పథకాల అమలు తీరుపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్ సమీక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పథకాల అమలు తీరుతెన్నులపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు కూచకుల్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, పీవీ వాణి దేవి, ఎమ్మెల్యేలు చర్లకోల లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, మహేశ్వర రెడ్డి, చిట్టెం రామ్ మోహన్ రెడ్డి, అలా వెంకటేశ్వర రెడ్డి, అబ్రహం, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, క్రాంతి కిరణ్ తదితరులు కలిసి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్, పిఆర్ ఈఎన్సీ సంజీవ రావు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, జిల్లాకు చెందిన ఆయా శాఖల ఎస్ఈలు, ఈఈ లు, డీఆర్డీఓలు, డీపీఓలు తదితరులతో హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ వెనుకబడిన పాలమూరు జిల్లా అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ వహించారని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను మరింతగా అభివృద్ధి చేసే బాధ్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలు, జ‌డ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీ లు, సర్పంచులు తీసుకోవాలని మంత్రులు కోరారు. అలాగే ప్రజా ప్రతినిధులు సూచించిన పనులు, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ పై నిర్లక్ష్యం చేయవద్దని అదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… ఉపాధి హామీ నిధుల వినియోగంలో మన రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. తాజాగా పంచాయతీ భవనాలు, కాలువల పూడిక తీత వంటి పనులకు కూడా ఉపాధి నిధులను వినియోగించుకోవాలని అధికారులకు చెప్పారు. అంతేగాక ఈ మార్చిలోగా సాధ్యమైనంత ఎక్కువ ఉపాధి పనులు చేయాలని అదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన గ్రామ పంచాయతీలు, ఎస్సీ రిజర్వు గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలకు ఎస్టీ, ఎస్సీ స‌బ్ ప్లాన్ నిధుల వినియోగం పై సీఎం ఆదేశానుసారం నడుచుకుంటానన్నారు. ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, రోడ్ల నిర్వహణ వంటి విషయాల్లో అధికారులు ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని అభివృద్ధి పనులు నిర్వహించాలన్నారు. కొత్త రోడ్లు, మురుగునీటి కాలువల పనులు కూడా త్వరలోనే వస్తాయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… ఉపాధిహామీ కింద కాలువల పూడిక తీయాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ లోకి నీళ్లు వచ్చే ఇన్ ఫాల్ రెగ్యులేటర్ వెంటనే నిర్మించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని వెంటనే నిర్మించాలని గతంలోనే ఆదేశించారన్నారు. ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్ కాలువల పూడిక తీయడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉపాధి హామీ కింద పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. రూరల్ వాటర్ సప్లైలో సంబంధిత ఏజెన్సీలలో క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సంఖ్య పెంచి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణంలో దెబ్బతిన్న సీసీ రహదారులు వెంటనే సరిచెయ్యాలన్నారు. లేదంటే గ్రామపంచాయతీలకు అప్పగించాలని, పీఎం జీఎస్ వై రహదారుల నిర్మాణం వేగం పెంచాలని అధికారులకు సూచించారు. గొప్ప మానవతా దృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్ వైకుంఠధామాలు గ్రామగ్రామాన నిర్మించారన్నారు. బతికినన్ని దినాలు కులాలు, మతాల పేరుతో కొట్టుకుంటున్నారన్నారు. ఆఖరుకు అంతిమ సంస్కారాలైనా ప్రశాంతంగా జరగాలన్నది ప్రభుత్వ ఉద్దేశమ‌ని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… గతంలో సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు కోయిల్ సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని డ్రింకింగ్ వాటర్ కు కేటాయించండ‌ని, మన్నెం కొండ టెంపుల్ వద్ద వాటర్ టాంక్ కట్టామ‌న్నారు. వేస్ట్ వాట‌ర్ కింద చెరువుకు పోవాలన్నారు. ఇక్కడ ఈ మేరకు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గురించే చెప్పారని, అంటే అందుకు తగ్గట్లుగా నిధులు అధికంగా ఇవ్వండ‌ని కోరారు. అలాగే పెండింగ్ బిల్స్ ఉంటే వెంటనే క్లియర్ చేయాలని, సీఎం ఆదేశించిన విధంగా… పనులు జరిగేట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు చెప్పే పనులకు కూడా ప్రాధాన్యత ఇవ్వండని మంత్రి సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement