Monday, April 29, 2024

చెత్త ట్రాక్ట‌ర్ ను అడ్డుకున్న పంచాయితీ కార్మికులు

జైనూర్,జూలై25(ప్రభన్యూస్) గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కామాటీలు కారబర్లు తమకు వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. మండల కేంద్రంలో చెత్తాచెదారం పెరిగిపోవటం వల్ల జై నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మెస్రం పార్వతి లక్ష్మణ్,జైనూర్ ఈవో శ్రీనివాసరెడ్డిలు అధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ కార్మికులతో ట్రాక్టర్ ద్వారా చెత్తాచెదారాన్ని తొలగించడానికి ఏర్పాట్లు చేయగా చెత్త తొలగించే డాక్టర్ ను మంగళవారం కొమరం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న కార్మికులు ట్రాక్టర్లను అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ప్రైవేటు కార్మికులచే పారిశుద్ధ్య పనులు చేస్తే అడ్డుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా కార్మికులు హమ్ హే కే అంటూ నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement