Monday, April 29, 2024

Palamuruలో బీజేపీ గెలవకుంటే పాతబస్తీ గా మారుతుంది…ఎమ్మెల్యే రాజాసింగ్

మహబూబ్ నగర్, నవంబర్ 27(ప్రభ న్యూస్): – తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణ చేశారని, మన కడుపులో పుట్టే బిడ్డ మీద కూడ రూ 1.25000 అప్పు మోపారని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులతో కలిసి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ముందుగా గ్రంథాలయం నుండి క్లాక్ టవర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం క్లాక్ టవర్ చౌరస్థలో కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ….స్థానిక బి ఆర్ ఎస్
ఎమ్మెల్యేను ఇంటికి పంపి తొలి రిటైర్మెంట్ ఇద్దాం అని తెలిపారు.

బీజేపీ కార్యకర్తలకు నేనొక్కటే చెప్తున్నా పాలమూరు లో బీజేపీ గెలవకుంటే పాతబస్తీ అవుతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మిథున్ రెడ్డి ని గెలిపించి అసెంబ్లీకి తీసుకుపోవడానికి తాను ఇక్కడికి వచ్చానని, కచ్చితంగా అసెంబ్లీ కి తీసుకెళ్తానని అన్నారు. మీ తమ్ముడు మిథున్ రెడ్డి ఇక్కడ నిలిచిండు రావాలని జితేందర్ రెడ్డి పిలిచాడని, జితేందర్ రెడ్డికి మిథున్ రెడ్డి గెలుపు కానుకగా ఇస్తానని తెలిపారు. గెలిచిన తరువాత పట్టణంలోని ప్రతి ఒక్క చౌరస్తాలో చత్రపతి శివాజీ విగ్రహం నిర్మిస్తానని అన్నారు.


బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఛత్రపతి శివాజీ విగ్రహం నిర్మించడానికి అడ్డుపడుతున్నారని ఐన వెనక్కు తగ్గనని తెలిపారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవుతాడని,తెలంగాణలో ముఖ్యమంత్రి బీసీ వచ్చినంక నేను బుల్డోజర్ బాధ్యత తీసుకుంటానని ఈ అవినీతి ఆస్తులను బుల్డోజర్ తో త‌వ్వి తీస్తా అని పేర్కొన్నారు .తెలంగాణ ప్రజలు కారుకు ఓటేసి గెలిపిస్తే కారు స్టీరింగ్ను కేసీఆర్ పాతబస్తీ నేతల చేతులలో పెట్టాడని తెలిపారు.
నేషనల్ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ లో ఆరుగురు టెర్రరిస్టులను పట్టుకుందని, ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా ఒక టెర్రరిస్టు పని చేస్తాడా….ఇదేనా కేసీఆర్ పరిపాలన అని ప్రశ్నించారు. తెలంగాణ లో బీ జేపీ అధికారం లోకి వస్తుందని భద్రతతో కూడిన పరిపాలన అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణా నాయక్, కృష్ణవర్ధన్ రెడ్డి, పాండురంగారెడ్డి, అచ్చిగట్ల అంజయ్య, యాదయ్య, బుచ్చిరెడ్డి, వేణమ్మ ,యాదమ్మ, పార్టీ కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement