Tuesday, May 14, 2024

ADB: బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

ఆసిఫాబాద్ రూరల్, నవంబర్ 27 (ప్రభ న్యూస్) : భారతీయ రాష్ట్ర సమితి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇవాళ పట్టణంలోని ఉస్మానియా మజీద్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ మీర్జాబేగ్, అహ్మద్ బిన్, యహియా, అబుభకర్, జునైద్, సబిల్, తదితరులు బీఆర్ఎస్ నాయకులు అబ్దుల్లా అమాన్ అహ్మద్ ఇస్లాంల ఆధ్వర్యంలో కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement