Friday, May 17, 2024

RR: నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. సునీతా లక్ష్మారెడ్డి

ప్రభ న్యూస్, ప్రతినిధి, మేడ్చల్, ఆగస్ట్ 11: నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో మహిళా సాధికారత, గృహ హింస, మహిళలపై నేరాలు, పని ప్రాంతంలో మహిళలపై లైంగిక వేధింపులు తదితర అంశాలపై సెమినార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… సమాజంలో మహిళలపై చోటు చేసుకుంటున్న వివిధ రకాల నేరాలు, ఘోరాలపై అవగాహణ కలిగి ఉండాలని సూచించారు. అంతే కాకుండా వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. అలాగే జిల్లాలో మహిళలపై ఎటువంటి సంఘటనలు జరిగినా వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని చైర్ పర్సన్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. సెమినార్ లో మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్థ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement