Sunday, April 28, 2024

TS : ప్రాణం తీసిన ఒక్క నిమిషం నిబంధన.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఉమ్మడి అదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్): నాకోసం.. మీరు ఎంతో చేశారు.. మొదటిసారి పరీక్షకు హాజరు కాలేకపోయా. జీవితంలో ఇంతటి బాధ ఎప్పుడూ చవి చూడలేదు.. క్షమించు నాన్నా.. అంటూ సూసైడ్ నోట్ రాసుకుని ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డ హృదయ విదారక ఘటన అదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే… ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన కారణంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ (19), బాధను ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్య కు పాల్పడ్డాడు.

- Advertisement -

మూడు నిమిషాలు ఆలస్యం కావ‌డంతో..
ఇంటర్ పరీక్షల తొలి రోజు బుధవారం ఆదిలాబాద్ లోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కేంద్రంలో పరీక్ష రాయడానికి మూడు నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు. నిమిషం నిబంధన కారణంగా పరీక్షకు అధికారులు అనుమతించలేదు. దీంతో పరీక్ష రాయలేదనే మనోవేదనతో తండ్రికి సూసైడ్ నోట్ రాసి జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టు డ్యాం లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం విద్యార్థి మృతదేహం కనుగొన్నారు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ,విద్యార్థి చేతి వాచి,పెన్ను లభించింది. తండ్రికి రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టించింది. ప్రభుత్వం పరీక్షకు హాజరయ్యేందుకు ఒక నిమిషం నిబంధన విధించిన కారణంగానే నిండు ప్రాణం బలైందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement