Sunday, April 21, 2024

AP : వామ‌నుడు కాదు… శిఖండే – ప‌వ‌న్ పై పేర్ని నానీ సెటైర్ ..

పురాణాల్లో పవన్‌ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ, జనసేన సభలో కేవలం జగన్‌మోహన్‌రెడ్డి నామస్మరణే చేశార‌ని ఎద్దేవా చేశారు.. త‌మ కూట‌మికే ఎందుకు ఓటేయ్యాలో చెప్ప‌లేక‌పోయార‌ని విమ‌ర్శించారు.

నేడు మ‌చిలీప‌ట్నంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల క్షేమం, రాష్ట్ర క్షేమం చంద్రబాబు, పవన్‌కు పట్టద‌న్నారు. కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్క మాట కూడా చెప్పలేద‌ని దెప్పిపొడిచారు. పవన్‌ సినిమా డైలాగ్‌లు బట్టీ కొట్టార‌ని, సినిమా వాళ్లు రాసిచ్చిన ‍స్క్రిప్ట్‌ను పవన్ వ‌ల్లే వేశార‌ని మండి ప‌డ్డారు. నాడు అమరావతి.. ఒక కులానికే రాజధాని అని పవన్‌ అన్నార‌ని గుర్తు చేశారు… రాజ‌ధానే అమ‌రావ‌తి అంటున్న‌ప‌వ‌న్ ఈరోజుకు అమరావతి విషయంలో ఏం మార్పు జరిగిందో చెప్పాల‌న్నారు.

- Advertisement -

పవన్‌ ఓ శిఖండి…..
పవన్‌ ఆయన గురించి ఆయనే చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడే చూస్తున్నామ‌న్నారు.. పురాణాల్లో పవన్‌ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉంద‌ని అంటూ పవన్‌ వామనుడు కాదు శల్యుడు, శిఖండి లాంటివాడ‌ని అంటూ సెటైర్ వేశారు. పార్టీని, పార్టీ నేతల్ని అందరినీ శల్యుడిలా పవన్‌ మొత్తం నిర్వీర్యం చేస్తున్నార‌ని అన్నారు. పవన్‌ సభలో అన్నీ సొల్లు కబుర్లేన‌ని, . పవన్‌ తనను నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచుతున్నార‌ని ఫైర్ అయ్యారు. ప్రజా జీవితంలో ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ప్రశ్నిస్తార‌ని చెప్పారు. 2024లో చంద్రబాబు, పవన్‌ జెండాలను ప్రజలు మడతేస్తార‌ని తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement