Thursday, April 25, 2024

నాన‌క్‌ రామ్‌గూడ‌లో పేలిన గ్యాస్ సిలిండ‌ర్.. ఒకరు మృతి..9 మందికి గాయాలు

హైదరాబాద్ లోని నాన‌క్‌ రామ్‌గూడ‌లో ఉన్న ఓ ఇంట్లో గ్యాస్ సిలిండ‌ర్ పేలింది. పేలుడు ధాటికి భ‌వ‌నం ధ్వంసం అయింది. ఈ ఘటనలో ఒక‌రు మృతి చెందగా.. మ‌రో 9 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా గ్యాస్ సిలిండ‌ర్ పేలుడు శ‌బ్దం విని చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement