Sunday, May 28, 2023

Good News: తెలంగాణలో 18 వేల టీచర్ల పోస్టుకు త్వరలో నోటిషికేషన్

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలు కానుంది. ఇప్పటికే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేలకు పైచిలుకు ఉద్యోగాలకు దశల వారిగా నోటిఫికేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో త్వరలో రాష్ట్రంలో ఉన్న ఖాళీగా టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 18 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. మొత్తం 1.20లక్షల టీచర్ పోస్టులకు ప్రస్తుతం 1.02 లక్షల మంది పనిచేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వాటిని భర్తీ చేయాలని సర్కార్ కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 వేల టీచర్ పోస్టులను కొత్త జిల్లాలుగా విభజించి కేటాయిస్తారని సమాచారం. ఈ 18 వేల పోస్టులు కాకుండా మరో 1,500 బోధనేత, డైట్, బీఈడీ కాలేజీలు, విద్యాశాఖ కార్యాలయాల్లో పోస్టులను కూడా జిల్లాల వారీగా విభజించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement