Sunday, April 28, 2024

TS | 26న కోటి వృక్షార్చన.. జీవ వైవిద్యానికి బలమైన పునాదులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఒకప్పుడు అస్తిత్వం కొరకు ఆరాటపడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అన్నింట్లోనూ ఆదర్శంగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సరికొత్త ఆలోచనతో ప్రారంభించిన ‘హరితహారం’ కార్యక్రమం ఎటు చూసినా పచ్చదనానికి, ఆహ్లాదకర వాతావరణానికి జీవం పోస్తోంది. జీవ వైవిద్యానికి బలమైన పునాధులు వేసిన ప్రభుత్వం ప్రపంచ రికార్డు వైపు దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఎనిమిది విడతలుగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్న ప్రభుత్వం 9వ విడత కార్యక్రమానికి సిద్ధమవుతోంది.

ఈ నెల 26న రంగారెడ్డి జిల్లా మంచిరేవుల టెక్‌ పార్కులో సీఎం కేసీఆర్‌ మొక్క నాటి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే రోజు 1.25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న ప్రభుత్వం ఆ మేరకు అధికార యంత్రాంగానికి మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణం దిశగా అభివృద్ధి సంక్షేమ రంగాలలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. హరితహారం కార్యక్రమం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణానికి ప్రాధాన్యత పెరిగింది. భవిష్యత్‌ తరాలకు ఆహ్లాదకరమైన చల్లని వాతావరణాన్ని, స్వచ్చమైన గాలి అందించేందుకు, జీవ వైవిధ్యతను కాపాడేందుకు 2015లోనే ‘తలంగాణకు హరితహారం’ అనే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి అమలుకు శ్రీకారం చుట్టింది.

ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన హరితహారంతో పచ్చని చెట్లతో అడుగడుగునా ఆహ్లాదం పంచుతున్న ప్రాంతాలుగా తెలంగాణ పల్లెలు, పట్టణాలు ఆవిర్భవించాయి. తెలంగాణకు హరితాహారం కింద 2015 నుంచి ఇప్పటి వరకూ రూ.11,095 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 288 కోట్ల 48 లక్షలు మొక్కలు నాటారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నం
పర్యావరణ పరిరక్షణకు ప్రపంచంలో చేపట్టిన పెద్ద మానవ ప్రయత్నాల్లో 3 వదిగా హారితహారం గుర్తింపు పొందింది. హరితహారం కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయుటకు ప్రజలను ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేస్తున్నది. ఆయా ప్రాంతాలు, నేలల స్వభావానికి అనువైన, ప్రజలు కోరుకునే రకాల మొక్కలను సరఫరా చేయుటకు రాష్ట్రవ్యాప్తంగా 14,864 నర్సరీలను ఏర్పాటు- చేశారు. నర్సరీల్లో ఈ సంవత్సరం 30.29 కోట్ల మొక్కలు పెంచారు. ప్రస్తుతం 9వ విడతలో భాగంగా ఈ సీజన్లో 19.29 కోట్ల మొక్కలు నాటనున్నారు. అందులో భాగంగా ఈ నెల 26 న మంచిరేవుల -టె-క్‌ ఫారెస్ట్‌ పార్కు లో చేపట్టే 1 కోటి 25 లక్షలు మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

- Advertisement -

13.44 లక్షల ఎకరాల అటవీ ప్రాంతం పునరుద్ధరణ
తెలంగాణకు హారితాహారంతో 2015 నుంచి ఇప్పటిదాకా దాదాపు 8శాతం గ్రీన్‌ కవర్‌ పెరిగింది. అటవీ పునరుద్ధరణ ప్రక్రియ సత్ఫలితాలు నిస్తున్నది. అందులో భాగంగా 2.03 లక్షల ఎకరాలలో బ్లాక్‌ ప్లాంటేషన్‌ కింద మొక్కలు నాటారు. 13.44 లక్షల ఎకరాలలోని క్షీణించిన అటవీ ప్రాంతం పునరుద్ధరించబడినట్లు అధికారులు వెల్లడించారు. చీడ పీడల నుంచి రక్షించుటకు 55 కోట్ల చెట్లు-, మొక్కలకు రూట్‌ స్టాక్‌ ట్రీ–టె-్మంట్‌ చేశారు. అలాగే అడవుల సంరక్షణ చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతాల చుట్టూ 10,980 కిలోమీటర్లు పొడవు కందకాలు తవ్వారు. ఫారెస్ట్‌ ఫైర్‌ లైన్లు ఏర్పాటు- చేశారు.

ఇవిగో.. హరితహారం విశిష్టతలు

  • రహదారి ఎవెన్యు ప్లాంటేషన్లు : 1,00,690 కిలోమీటర్లు
  • మల్టీ లెవెల్‌ రహదారి ప్లాంటేషన్లు : 20,828 కిలోమీటర్లు
  • రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు- చేసిన నర్సరీలు : 14,864
  • ఈ ఏడాది నర్సరీల్లో పెంచిన మొక్కలు : 30.29 కోట్లు-.
  • ప్రస్తుత సీజన్లో నాటే మొక్కలు లక్ష్యం : 19.29 కోట్లు-
  • పల్లె ప్రకృతి వనాలు : 19,472
  • బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు : 2,077
  • 164 హరిత వనాల ద్వారా 1.71 లక్షల ఎకరాలు
  • ఆ విస్తీర్ణం పెంచుతున్న మొక్కలు : 1.16 కోట్లు-
  • ఆ పరిధిలో 1.6 లక్షల ఎకరాల్లో 188 ఫారెస్ట్‌ బ్లాకుల అభివృద్ధి
  • సీఎం కేసీఆర్‌ మంచిరేవుల -టె-క్‌ పార్కులో నాటే మొక్కలు ఒకే రోజు 1.25 కోట్లు
Advertisement

తాజా వార్తలు

Advertisement