Friday, May 3, 2024

Numerology – ’30’…’03’… కెసిఆర్ హ్యాట్రిక్ ఖాయం … కెటిఆర్ ..

ప‌ర‌కాల – తెలంగాణ ఎన్నిక‌ల తేదీల‌ను చూస్తుంటే.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్ట‌డం ప‌క్కా అనిపిస్తుంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన ప్ర‌గ‌తి నివేదన స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

న‌వంబ‌ర్ 30 ఎన్నిక‌లు, డిసెంబ‌ర్ 3న కౌంటింగ్.. ఈ తేదీల‌ను చూస్తుంటే క‌రెక్ట్‌గా ఈసారి మ‌న‌కు లెక్క కూడా కుదిరిన‌ట్టు ఉంద‌ని కేటీఆర్ తెలిపారు. 30, 03, కేసీఆర్ మూడోసారి కూడా ముఖ్య‌మంత్రి అవుడు హ్యాట్రిక్ ప‌క్కా అనిపిస్తుంది. మ‌న‌కు అన్ని క‌లిసి వ‌స్తున్నాయి. మూడు మూడు ఆరు.. మ‌న ల‌క్కీ నంబ‌ర్ కూడా ఆరే. మూడోసారి కేసీఆర్ ముఖ్య‌మంత్రి అవుడు కూడా ప‌క్కానే ఉన్న‌ది. తేదీలు కూడా మంచిగానే కుదిరిన‌ట్టు అనిపిస్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఎల‌క్ష‌న్లు వ‌చ్చాయ‌ని,.. ఇక సంక్రాంతి పండుగ‌కు గంగిరెద్దుళ్లోళ్లు వ‌చ్చిన‌ట్లు కాంగ్రెస్ నాయ‌కులు వ‌స్తార‌ని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నాయ‌కులు నోటికొచ్చిన క‌థ‌లు చెబుతార‌ని,. కేసీఆర్, ధ‌ర్మారెడ్డిని ఓడించ‌మ‌ని చెబుతార‌ని అయితే విచ‌క్ష‌ణ‌తో, ఆలోచ‌న‌తో చైత‌న్యాన్ని ప్ర‌ద‌ర్శించి ఓటేయాల‌ని కోరారు.. 2014లో మ‌న ప‌రిస్థితి ఏంది..? ఇప్పుడు ప‌రిస్థితి ఏంది? అనేది ఆలోచించాలి. క‌రెంట్, మంచినీళ్లు, వ్య‌వ‌సాయం, సాగునీటి, సంక్షేమం గురించి ఆలోచించండి. రెచ్చ‌గొట్టే ముచ్చ‌ట్లు చెబితే ఆగం కావొద్దు.. ఆందోళ‌న చెందొద్దు. మేం చెప్పింది వాస్త‌వ‌మైతే ధ‌ర్మారెడ్డిని 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాల‌ని కేటీఆర్ కోరారు.
కాంగ్రెస్ హ‌యాంలో కాలిపోయే మోటార్లు.. పేలిపోయే ట్రాన్స్‌ఫార్మ‌ర్ల ప‌రిస్థితిని చూశామ‌ని కేటీఆర్ తెలిపారు. ఆరు గంట‌ల క‌రెంట్ కూడా మూడుసార్లు ఇచ్చేవారు. దీంతో నాడు వ్య‌వ‌సాయం ఆగ‌మైంది. ప‌రిశ్ర‌మ‌లు న‌డుపుదామంటే క‌రెంట్ లేదు. మరి ఇవాళ 60 ఏండ్ల‌లో క‌రెంట్ ఇవ్వ‌ని కాంగ్రెస్.. ఇవాళ వ‌చ్చి అది చేస్తా.. ఇది చేస్తా అని డైలాగులు కొడితే మోస‌పోదామా..? ఆరు నెల‌ల్లోనే క‌రెంట్ స‌మ‌స్యను ప‌రిష్క‌రించిన కేసీఆర్‌కు ఓటేద్దామా? అనేది ఆలోచించుకోవాల‌ని కేటీఆర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement