Thursday, April 25, 2024

ESIC లో 491 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

ప్రభుత్వ పరిధిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESICలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత కలిగినవారు ఈనెల 18 లోపు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 491 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఈ పోస్టులు ఈఎస్‌ఐసీ పీజీఐఎంఎస్‌ఆర్‌, మెడికల్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఖాళీగా ఉన్నపోస్టుల్లో అనస్థీసియాలజీ 40, అనాటమీ 19, బయోకెమిస్ట్రీ 14, కమ్యూనిటీ మెడిసిన్‌ 33, డెంటిస్ట్రీ 3, డెర్మటాలజీ 5, ఎమర్జెన్సీ మెడిసిన్‌ 9, ఎఫ్‌టీఎం 5, జనరల్‌ మెడిసిన్‌ 51, జనరల్‌ సర్జరీ 58, మైక్రోబయాలజీ 28, ఓబీజీవై 35, ఆప్తల్మాలజీ 18, ఆర్థోపెడిక్స్‌ 30, ఈఎన్‌టీ 17, పీడియాట్రిక్స్‌ 33, పాథాలజీ 22, ఫార్మకాలజీ 15, ఫిజికల్‌ మెడిసిన్‌-రిహాబిలిటేషన్‌ 8, సైకాలజీ 14, సైకియాట్రీ 7, రేడియాలజీ 14, రెస్పిరేటరీ మెడిసిన్‌ 6, స్టాటిస్టీసియన్‌ 4, బ్లడ్‌ బ్యాంక్‌ 3 చొప్పున ఉన్నాయి. ఈ పోస్టులకు అర్హతలు సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్‌ చేసి, 40 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. జూలై 18లోపు www.esic.nic.in వెబ్ద సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement