Friday, June 14, 2024

TGRTC : టీఎస్ ఆర్టీసీ కాదు…. ఇక పై టీజీఎస్ ఆర్టీసీ

తెలంగాణ ప్ర‌భుత్వం టీఎస్‌ని టీజీగా మార్చాల‌ని నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని వాహ‌నాల రిజిస్ట్రేష‌న్‌ల‌లో టీజీగా పేరును రూపొందిస్తున్నాయి. ఇక టీఎస్‌ఆర్టీసీ కూడా త‌న పేరును మార్చి టీజీఎస్‌ ఆర్టీసీగా నామ‌క‌ర‌ణం చేసుకుంది.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు టీఎస్‌ఆర్టీసీ పేరును టీజీఎస్‌ ఆర్టీసీగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నట్లు రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాల పేర్లనూ మార్చింది. ప్రయాణికులు తమ సూచనలు, ఫిర్యాదులను ఇకపై @tgsrtcmdoffice, @tgsrtchq ఖాతాల ద్వారా అందించాలని కోరింది. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఈ వివరాలను వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement