Friday, October 11, 2024

Nomination – నిజామాబాద్ రూరల్ లో నామినేష‌న్ వేసిన బిఆర్ఎస్ , కాంగ్రెస్ అభ్య‌ర్ధులు

నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో అభ్యర్థుల నామినేషన్లకు వివిధ మండలాల నుంచి నాయకులు కార్యకర్తలు భారీగా వచ్చారు. బీ ఆర్ ఎస్ పార్టీ రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూపతి రెడ్డి లు రూరల్ నుండి నామినేషన్ లు దాఖలు చేశారు.వీరి కార్యాలయాల నుండి ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. డిచ్ పల్లి దర్పెల్లి సిరి కొండ నిజామాబాద్ రూరల్ మోపాల జాక్రన్ పల్లి మండలాల నుండి భారీగా వచ్చారు.నామినేషన్ అనంతరం మీడియా తో మాట్లాడిన బాజిరెడ్డి ర్యాలీగా వెళ్ళారు.గోవర్దన్ నామినేషన్ ముందు ఆయన నివాసంలో ప్రత్యేక పూజలు. వేద పండితులు వేద మంత్రాలు చదివారు.ఉదయం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement