Friday, May 3, 2024

విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయలు లేవు – సిఎండి ప్రభాకర్ రావు

వేములవాడ – తెలంగాణ లో స్వామి దయ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పర్యవేక్షణలో ఇప్పటివరకు తెలంగాణలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వలేదన్నారు తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ కో & జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు .సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు

ఆనంతరం మీడియా తో. మాట్లాడుతూ రాష్ట్రం లో 24 గంటల కరెంట్ పై మాట్లాడుతూ కరెంట్ ఎన్ని గంటలు అనేది ముఖ్యం కాదు.. పంటలు ఎండినట్లు మా దృష్టికి లేదు..రాష్ట్రం లో నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం అన్నారు.కరెంట్ విషయం లో పొలిటికల్ కి సంబంధం లేదు కరెంట్ పై ఇంత వరకు ఎటువంటి సమస్య లేదు. ఒకప్పుడు కరెంట్ పోతే వార్త, ఇప్పుడు కరెంట్ ఉంటే వార్త అన్నారు.గణనీయంగా విద్యుత్ వాడకం పెరగడంతో డిమాండ్‌కు అనుణంగా 15,497 మెగావాట్ల విద్యుత్తును నిరాటంకంగా అందించ గలిగామన్నారు. విద్యుత్‌ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడంతో 18 వేల మెగావాట్లు వచ్చినా.. ఇబ్బందిలేకుండా సరఫరా చేయగలుగుతామన్నారు.

వ్యవసాయ అవసరాలకు విద్యుత్ వినియోగం పెరిగింది. గత ఏడాదితో పోల్చితే రాష్ట్రంలో రోజుకు 3500 నుంచి 4వేల మెగావాట్ల విద్యుత్తు వినియోగం పెరిగిందని పేర్కొన్నారు.అందుకు అనుగుణంగా రోజుకు 20 నుంచి 25 కోట్ల రూపాయలను వెచ్చించి విద్యుత్తును కొనుగోలు చేసి నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాణ్యమైన 24 గంటల విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. రాజకీయాలతో మాకు ఎలాంటి సంబంధం లేదని, ఇప్పటివరకు ఎక్కడా పంటలు ఎండినట్టుగా కూడా మా దృష్టికి రాలేదని సీఎండీ తెలిపారు.ఇటీవల కాంగ్రెస్ నేత కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓక సబ్ స్టేషన్ లో డైరెక్ట్ రికార్డ్స్ చూపించి 24 గంటల కరెంట్ రావడం లేదని నిరూపిస్తే ఎంపీ రాజీనామా చేస్తారన్న అంశంను వేలేకరులు దృష్టికితీసుకురగా సమాధానం అడుగుతుండగానే మధ్యలో నే లేచిపోయారు.

అయన వెంట సెస్ చైర్మన్ చిక్కాల రామ రావు, ఉన్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement