Sunday, April 28, 2024

NZB: ధన ధన ధన దప్పులతో.. ఎమ్మెల్యే గణేష్ బిగాల పాట రిలీజ్..

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 26 (ప్రభ న్యూస్) : దళితుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రత్యేక కృషి చేశారని టిఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షులు మళ్ళమారి సుధాకర్ అన్నారు. ధన ధన ధన దప్పులతో వస్తున్నాడు గణేష్ బిగాల అంటూ అర్బన్ ఎమ్మేల్యే గణేష్ బిగాల పై టిఎమ్మార్పీఎస్ నగర అద్యక్షులు మళ్ళమారి సుధాకర్ ఆధ్వర్యంలో ఆడియో పాటను నిజామాబాద్ నగరంలోని జనార్ధన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మాదిగ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ పాటను తెలం గాణ ఉద్యమ కళాకారుడు, ప్రముఖ గాయకులు కొండాపూర్ మహేందర్ రచన గానం చేయగా, వెంకటేష్ ఈ పాటకు కోరస్ అందించారు.

2023లో అర్బన్ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ఈ పాటను రూపొందించినట్లు సుధాకర్ తెలిపారు. కాగా ఈ పాటలు విన్న అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగాల, నగర మేయర్ నీతు కిరణ్ సుధాకర్ ను అభినందించారు. ఈ పాట అర్బన్ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిపై అర్బన్ ఎమ్మెల్యే సహాయ సహకారాలపై, ఆయన చేసిన సేవలను కొనియాడుతూ రాసిన పాట ఆత్మీయ సమ్మేళనంలో అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు దళితులు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, 37 కార్పొరేటర్ లు కంపల్లి ఉమారని ముత్యాలు, బట్టు రాఘవేందర్, మాజీ కార్పొరేటర్ కనకం సుధ సదనంద్, మాదిగ సంఘం నాయకులు సిద్ధి రాములు, దండు శేఖర్, మందమరి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement