Monday, April 29, 2024

NZB: వైకుంఠధామం.. మూన్నాళ్ళ ముచ్చటేనా ? .. బీజేపీ నేత ధనపాల్

నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 5 (ప్రభ‌ న్యూస్): నిజామాబాద్ నగరంలో అర్సపల్లిలో గత రెండు నెలల క్రితం హడావిడి చేసి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించిన వైకుంఠ గ్రామం ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులోకి ఎందుకు తీసుకురాలేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధ‌న‌పాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. గురువారం నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో 14, 15వ‌ డివిజన్ల‌ ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ స్థానిక అర్సపల్లి ప్రజలతో కలిసి వైకుంఠధామం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… తూతూ మంత్రంగా పత్రికా ప్రకటనల కోసం ఎన్నికల సమయంలో ప్రజలకు ఏదో చేసినమని మాత్రమే వైకుంఠధామం ప్రారంభించడం జరిగిందన్నారు. కోట్ల రూపాయలతో ప్రారంభించినా ప్రజలకు అందుబాటులో లేకపోవడం బాధాకరమన్నారు.

నిజామాబాద్ నగరంలో గణేష్ గుప్తా అభివృద్ధి ఇదేనా అని ప్రశ్నించారు. అన్ని వైకుంఠధామాలకు తాళం వేసి ఉంచారన్నారు. వెంటనే వైకుంఠ ధామాలు తెరవాల‌న్నారు. లేకపోతే అన్ని వైకుంఠధామాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. గణేష్ గుప్తా దత్తత తీసుకున్న డివిజన్ లోనే ఈ పరిస్థితి ఉంటే మిగతా డివిజన్ల‌లో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కుల సంఘాలకు ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వడం కాదు.. వెంటనే వారికి డబ్బులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఆర్మీ రమేష్ రంజిత్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మెట్టు విజయ్, ఎర్రం సుధీర్, పంచ రెడ్డి శ్రీధర్, గోపిడి వినోద్ రెడ్డి, ఇల్లెందుల ప్రభాకర్, బూర్గుల వినోద్, బీజేపీ నాయకులు శివనూరి భాస్కర్, మట్టం పవన్, బట్టికారి ఆనంద్, పవన్ ముందడ, ఆశిష్ పల్నాటి కార్తీక్, డివిజన్ వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement