Sunday, April 28, 2024

NZB: మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు నిర్ణయం హర్షణీయం..

నిజామాబాద్, మార్చి 16(ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు నిర్ణయం హర్షనీయమని, సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు ఆకుల లలిత, మున్నూరు కాపు జిల్లా ప్రధాన కార్యదర్శి బంటు బలరాం, కోశాధికారి ధర్మపురి సురేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ప్రగతినగర్ లో గల మున్నూ రు కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం కాపుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. గతంలో మున్నూరు కాపులను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, సీఎం రేవంత్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మున్నూరు కాపుల తరపున ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆరు గ్యారెంటీ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్, రామార్తి గంగాధర్, బాలవర్డి, కోడెపు శరత్, దారం సాయిలు, శంకర్, ఆది శ్రీనివాస్, జిల్లా మున్నూరు కాపు సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement