Sunday, April 28, 2024

NZB: యువతకు స్ఫూర్తి స్వామి వివేకానంద.. ఎమ్మెల్యే సూర్యనారాయణ

నిజామాబాద్ సిటీ, జనవరి 12 (ప్రభ న్యూస్): యువత స్వామి వివేకానంద ఆశయ సాధనకు కృషి చేయా లని, యువత కు స్ఫూర్తి స్వామి వివేకానంద అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నిజామాబాదు నగరంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

నగరం లోని నాగారం, గాజులపేట లోని వివేకానంద విగ్రహాలకు అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ విశ్వంలో ప్రతి ఒక్క దేశం.. ప్రతి ఒక్క వ్యక్తి స్వామి వివేకానందుడిని ఎంతగానో గౌరవిస్తారు. ఎందు కంటే భారతదేశం తరపున అమెరికా వెళ్లి అక్కడి ప్రజలందరిచేత తన మాట తీరుతో అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. మన దేశంలో ఆధ్యాత్మిక విషయాల గురించి, సనాతన ధర్మం గురించి విశ్వానికి ఎంతో చక్కగా వివరించారు.ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద జయంతిని జరుపుకుంటారన్నారు.

- Advertisement -

ఇదే రోజున ‘జాతీయ యువజన దినోత్సవం’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వివేకానందునికి యువతతో చాలా లోతైన అనుబంధం ఉంది. అందుకే తన పుట్టి నరోజు యువతకు అంకితం ఇవ్వబడిందన్నారు. ఈ కార్యక్ర మంలో స్థానిక కార్పొరేటర్ ఇల్లేందుల మమత ప్రభాకర్, పోతనకర్ లక్ష్మి నారాయ ణ,నాగోల్ల లక్ష్మి నారాయణ, డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement