Tuesday, April 30, 2024

మళ్లి ఆందోళన బాటపట్టిన బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు.. భోజనం చేయకుండా మెస్‌లో నిరసన..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు మళ్లిd ఆందోళన బాటపట్టారు. మెస్‌లో కూర్చుని తమ నిరసనను విద్యార్థులు తెలిపారు. ఫుడ్‌పాయిజన్‌ అయిన మెస్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. శనివారం రాత్రి పూట భోజనం చేయకుండా మెస్‌లొనే కూర్చొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పట్టుబట్టారు. ఇటీవల బాసరలో ఫుడ్‌ పాయిజన్‌ కావడంవల్ల పలువురు విద్యార్థులు ఆసుపత్రిపాలైన విషయం తెలిసిందే.

బాసర ట్రిపుల్‌ ఐటీకి ఇంచార్జీ వీసీగా ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్‌ ప్రొ.వి.వెంకటరమణను ఇటీవలే ప్రభుత్వం నియమించింది. అయినా కానీ ఇంకా పలు సమస్యలు అలానే అపరిష్కృతంగా మిగిలిఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement