Sunday, April 28, 2024

NZB: సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి… లక్ష్మణ్ సింగ్

బిక్కనూర్, ఆగస్టు 11, ప్రభ న్యూస్ : సీజనల్ వ్యాధుల నివారణకు సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గల ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో గల పలు రికార్డులను పరిశీలించి, మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య ఉప కేంద్రానికి వచ్చే రోగుల వివరాలు సిబ్బంది ఆయనకు వివరించారు.

అనంతరం మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కువ శాతం కాన్పులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి కావలసిన మందులు సకాలంలో అందించాలని తెలిపారు. ఆరోగ్య ఉపకేంద్రాల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. వర్షాకాలంలో సోకే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి ఆదర్శ్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ, ఆరోగ్య ఉపకేంద్రం రేణుక, వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement