Saturday, May 4, 2024

Postal Department నిర్వాకం – కొన్ని నెలలుగా డెలివరీ కాని వేలాది లెటర్స్

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)9: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజలకు ఎప్పటికప్పుడు పోస్టుమన్ ఉత్తరాలను అందజేయకుండా ఏకంగా కొన్ని మాసాల నుంచి ఉత్తరాలను సంచులలో పోస్టుమన్ దాచి ఉంచడం… 12 సంచులలో ఉత్తరాలు కుప్పలు కుప్పలుగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. నగరంలోని సుభాష్ నగర్ లో తమకు రావాల్సిన ఏటీఎం కార్డులు, ఉత్తరాలు రావ డంలేదని పలుమార్లు సుభాష్ నగర్ లోని పోస్ట్ ఆఫీస్ లో అధికారుల దృష్టికి కొందరు తీసుకెళ్లారు. పోస్ట్ ఆఫీస్ లో అధికారులు ఎవరు స్పందించక పోవడంతో నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్ వద్ద గల అసిస్టెంట్ సూపరిటెం డెంట్ అధికారికి ఫిర్యాదు చేశారు.

కాగా శనివారం అసిస్టెంట్ సూపరిటెండెంట్ అధికారి ఎంక్వైరీ చేయగా సద రు పోస్టుమన్ వద్ద 12 సంచుల ఉత్తరాలు లభ్యమైనట్టు సమా చారం.

పోస్టల్ అసిస్టెంట్ అధికారి అత్యుత్సాహం…

సమాచారం తెలుసుకున్న జర్నలిస్టులు సుభాష్ నగర్ లోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్దకు వెళ్లగా అసిస్టెంట్ పోస్టల్ అధికారి కార్యాలయంలోనికి రానివ్వకుండా జర్నలిస్టు లతో దురుసుగా ప్రవర్తించాడు. ఉత్తరాలు పంచకుండా ఉన్న ఉత్తరాల సంచులను… చూడనివ్వకుండా.. కార్యాల యంలో జరిగిన తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నిం చాడు. ప్రతినె ల వేతనం తీసుకొని తమ పని తాము చేయకుండా… ఎప్పటి కప్పుడు ప్రజలకు ఉత్తరాలను దాచిపెట్టడం ఏమిటని స్థానిక ప్రజలు మండిపడ్డారు.

ఉత్తరాలపై కొందరి జీవితాలు ముడిపడి ఉంటాయి..

- Advertisement -

ఒక ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ కంపెనీ నుండి కాల్ లెటర్ ఉత్తరం ద్వారానే వస్తది… కాల్ లెటర్ ఉత్తరం ద్వారా సమయానికి రాకుంటే వారి పరిస్థితి ఏమిటి. బ్యాం కులో డబ్బులు విత్ డ్రా చేసుకో వడానికి ఏటీఎం కార్డు కూడా ఎంతో అత్యవసరం అలాంటి ఏటీఎం కార్డు ఈ పోస్ట్ శాఖ ద్వారానే అందరికీ చేరుతుంది. ఇలా ఉత్తరాలపై కొందరి జీవితాలు ముడిపడి ఉంటాయి..ఒకప్పుడు ఉత్తరం కోసం వేయికళ్లతో ఎదురుచూసే వారు. సెల్ ఫోన్లు, ఈమెయిల్ రాని రోజుల్లో.. మనుషుల మధ్య సమాచారం అందివ్వాలంటే ఉత్తరాలే దిక్కు. ఉత్తరంరాస్తే.. అది రెండు మూడు రోజుల తర్వాత తమవారి చెంతకు చేరింది.

అయితే టెక్నాలజీ, డిజిటలైజేషన్ తర్వాత ఉత్తరాల ఊసే లేకుండా పోయింది. అయితే ఇవాల్టికి మనకు కొన్ని రకాల డాక్యుమెం ట్లు, బ్యాంకులకు సంబంధిం చిన ఏటీఎం కార్డులు, పిన్‌ సంబంధిత వివారలన్నీ పోస్టు ద్వారానే చేరుతుంటాయి. అయితే ఓ పోస్టుమ్యాన్ అలా వచ్చే ఉత్తరాలను పంచకుండా తన వద్దే ఉంచుకోవడంపై నిజామాబాద్ నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒకటి రెండు కాదు ఏకంగా కొన్ని నెలలుగా ఉత్తరాలు పంచకుండా తనవద్ద ఉంచుకున్నాడు.

ఉత్తరాల సంచులను లెక్కిస్తున్నారు.

సుమారు 12 సంచులలో గల ఉత్తరాలను వేరువేరుగా చేసి.. అధికారులు లెక్కిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ ఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా కొందరు ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement