Thursday, October 10, 2024

Hockey WC | కెనడాపై భారత్ ఘన విజయం.. క్వార్టర్ ఫైనల్స్‌ ప్రవేశం..

మలేషియా వేదికగా జరుగుతున్న FIH హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్ 2023లో భారత్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ఇవ్వాల (శనివారం) జరిగిన తమ చివరి గ్రూప్-స్టేజ్ గేమ్‌లో కనెడాపై 10-1 పాయింట్ల తేడాతో ఘ‌న విజయాన్ని సొంతం చేసుకుంది భారత్.

ఉత్తమ్ సింగ్ నేతృత్వం వహిస్తున్న భారత హాకీ జట్టు.. తమ మెదటి మ్యాచ్‌లో కొరియాపై 4-2తో విజయం సాధించి శుభారంభం చేసింది. అయితే, టోర్నీలోని రెండో మ్యాచ్‌లో స్పెయిన్‌తో 4-1తో ఓటమిపాల‌య్యింది. ఇక ఇవ్వాల కెనడాతో జ‌రిగిన మ్యాచ్ లో భారీ మార్జిన్‌తో గెలుపొందిన భారత్ నాకౌట్ స్టేజ్‌లోకి ప్రవేశించింది.

పురుషుల జూనియర్ ప్రపంచ కప్ లో క్వార్టర్స్‌కి చేరుకున్న జట్లు..

పూల్ ఏ :
అర్జెంటీనా – 9 పాయింట్లు.
ఆస్ట్రేలియా – 6 పాయింట్లు.

- Advertisement -

పూల్ బి :
ఫ్రాన్స్ – 9 పాయింట్లు.
జర్మనీ – 6 పాయింట్లు.

పూల్ సి :
స్పెయిన్ – 9 పాయింట్లు.
భారతదేశం – 6 పాయింట్లు.

పూల్ డి :
నెదర్లాండ్స్ –
పాకిస్తాన్ –

Advertisement

తాజా వార్తలు

Advertisement