Monday, May 6, 2024

చూసి రాత పరీక్షలుగా.. ఓపెన్ టెన్త్ పరీక్షలు..

మాచారెడ్డి (కామారెడ్డి), ప్రభన్యూస్ మే 2 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత ఐదు రోజులుగా నడుస్తున్న ఓపెన్ టెన్త్ పరీక్షలు చూసి రాత పరీక్షలుగా మారడం జరిగింది. ప్రతి ఏటా కామారెడ్డిలో ఓపెన్ 10 పరీక్షలు చూసి రాత పరీక్షలుగా మారిపోయాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఉండి కలెక్టర్ తో పాటు డీఈవో ఉన్నప్పటికీ పదవ తరగతి పరీక్షల్లో జరిగే అక్రమాల‌ను పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఎవరైనా ఫిర్యాదు చేస్తే అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మూడు పరీక్ష కేంద్రాల్లో ఓపెన్ టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. అభ్యర్థికి బదులు మరొకరు పరీక్షలు రాస్తున్నారు.

ఇదంతా పరీక్ష కేంద్రాల్లో ఉండే సిబ్బంది అభ్యర్థుల నుంచి వేల రూపాయల డబ్బులను స్వీకరించి ఓపెన్ టెన్త్ మాల్ పరీక్షను ప్రోత్సహిస్తున్నారు. స్వయంగా సిబ్బంది బోర్డుపై సమాధానాలు వ్రాస్తున్నట్లు సమాచారం. ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాయడం నిబంధనలకు విరుద్ధం. నిజమైన అభ్యర్థులు మాట్లాడుతూ… ఓపెన్ టెన్త్ లో మాల్ ప్రాక్టీస్ ను అరికట్టాల్సిన అవసరముంద‌న్నారు. కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తే డమ్మీ అభ్యర్థుల బాగోతం బయట పడుతుందని, జిల్లా కలెక్టర్ స్పందించాలని నిజాయితీగా పరీక్షలు రాసే అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రతి ఏటా లక్షల‌ రూపాయలు ఈ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement