Monday, April 15, 2024

Nizamabad – సేవకు పదవి అవసరం లేదు – మాజీ ఎమ్మెల్యే బీగాల

.నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)6:ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా తీర్పును గౌరవిస్తాను…సేవ చేయాలనే సంకల్పం ముందు ఎటువంటి పదవి అవసరం లేదని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. బుధవారం నగరంలో ని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యా లయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజా మాబాద్ అర్బన్ మాజీ ఎమ్మె ల్యే గణేష్ బిగాల మాట్లాడు తూ.. తొమ్మిదిన్నర సంవత్స రాలు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ప్రజలు నాకు అవ కాశం కల్పించారన్నారు.

.ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కువ సమయం అభివృద్ధి పనులకు కేటాయించానన్ని తెలిపారు.

గడిచిన నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం, ఐటి హబ్, మినీ ట్యాంక్ బండ్,రైల్వే వంతెన, వైకుంఠ దామలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, డివైడర్ లు,అందమైన లైట్లు నిర్మాణం చేసాననీ అన్నారు. కుల సంఘాలను గౌరవిస్తూ కుల మతాలకు అతీతంగా కోట్ల రూ.లు భవనాలు నిర్మాణం కోసం సిడిపి నిధులు మం జూరు చేసాననీ పేర్కొన్నారు.ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు కరోన విపత్కర సమయంలో, భారీ వర్షాలు కురిసినపుడు వారికి అండగా ఉంటూ ఉచి తంగా భోజనం అంద చేశానని తెలిపారు. అర్హులైన వారికి కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్, పింఛన్లు CMRF చెక్కులు అందిస్తూ వారికి భరోసా ఇచ్చాననీ అన్నారు. అధికార పార్టీ నాయకులు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనీ కోరారు. తెలం గాణ సాధన లో భాగంగా కేసీఆర్ పిలుపు మేరకు గల్లీ లో,ఢిల్లీ లో ఉద్యమంలో పని చేసాననీ గుర్తు చేశారు.2009 లో ఎం. పి.గా పోటీ చేసి ఓడిపోయిన కూడా ప్రజల కు,కార్యకర్తలకు అందుబా టులో ఉన్నాననీ తెలిపారు.నిజామాబాద్ ప్రజలకు ఎటు వంటి ఆపద వచ్చిన సోదరు నిల అండగా ఉంటాననీ హామీ ఇచ్చారు.ఎన్నికల్లో ఓట్లు వేసిన వారికి ఓట్లు వేయని వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేయర్ దండు నీతు కిరణ్ ,రెడ్కో మాజీ చైర్మన్ SA అలీం,నుడ మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బి.ఆర్. ఎస్ నాయకులు మీర్ మాజాజ్ అలీ,నవీద్ ఇక్బల్, సుజిత్ సింగ్ ఠాకూర్,సత్య ప్రకా ష్,సిర్ప రాజు, యెనుగందుల మురళి,రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement