Tuesday, November 12, 2024

Kamareddy: హుండీలో చెయ్యి పెడితే..

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర పల్లిలోని మాసుపల్లి పోచమ్మ ఆలయంలో ఓ దొంగ హుండీలో దొంగ త‌నానికి పాల్ప‌డ్డాడు. అయితే ఆలయంలో పని చేసే సురేష్ అనే వ్య‌క్తే హుండీ చోరికి య‌త్నించాడు. హుండీలో డబ్బులు తీసేందుకు చేయి పెట్టిన దొంగ సురేష్, హుండీలో చేయి ఇరుక్కుని నరకయాతన అనుభవించాడు.

దాంతో ఇవాళ‌ ఉదయం ఆలయం తెరిచే సమయానికి పరిస్థితిని అర్థం చేసుకొని గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement