Saturday, May 18, 2024

ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ అలవర్చుకోవాలి : పోలీసు కమిషనర్

నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూడ్ రిజర్వు సిబ్బందికి మోబైలేజేషన్ శిక్షణ ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు హాజరయ్యారు. మొదట సిబ్బంది నుండి పోలీస్ కమిషనర్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… ఫేస్ 1, ఫేస్ 2 లు ఈనెల 22 నుండి 28 వరకు మోబైలేజేషన్ శిక్షణ నిర్వహించడం జరిగిందని, ఈ శిక్షణ కాలంలో ఫిజికల్ ఎక్సర్ సైజ్ ,యోగ, స్కాడ్ డ్రిల్, ఆమ్స్ డ్రీల్, లాఠీ డ్రిల్, ఆయుధాలపై అవగాహన, ఫైరింగ్ ప్రాక్టీసు, ఫీల్డ్ క్రాఫ్ట్, మొదలగు వాటి పట్ల తర్ఫీదు ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలపై జరిగే అఘాయిత్యాల సమయంలో ఏవిధంగా ఆత్మరక్షణ చేసుకోవాలో తర్ఫీదు, ప్రతిరోజు సాయంత్రం, స్పోర్ట్స్ తర్ఫీదు, సిబ్బంది ఎల్లప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ గా ఉన్నప్పుడే చక్కగా విధులు నిర్వహిస్తారన్నారు. సమాజంలో పోలీసులకు మంచి పేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి.అరవింద్ బాబు, అదనపు డి.సి.పి (అడ్మిన్ ) ఉషా విశ్వనాథ్, అదనపు డి.సి.పి పీ గిరిరాజ్, అదనపు డి.సి.పి (ఆపరేషన్) నరేందర్ రెడ్డి, సీసీఎస్ ఏసీపీ కె. కరుణసాగర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్ట‌ర్ శ్రీహరి, రిజర్వ్ ఇన్ స్పెక్ట‌ర్స్ అనిల్ కుమార్, శైలంధర్, శేఖర్, ఆర్ఎస్సైలు, సిబ్బంది హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement