Monday, May 6, 2024

NZB: న్యాక్ ద్వారా శిక్షణతో పాటు ఉపాధి అవకాశం…

భీమ్‌గల్ టౌన్, అక్టోబర్ 7 (ప్రభ న్యూస్) : న్యాక్ ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశం కల్పించడం జరుగుతుందని డాక్టర్ మధు శేఖర్ అన్నారు. శనివారం భీమ్‌గల్ సహస్ర ఫంక్షన్ హాల్ లో శిక్షణ పొందిన 125మంది భవన్ నిర్మాణ కుటుంబ ఆధారిత మహిళలకు 125 కుట్టు మిషన్లను ఆయన అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి నిరుద్యోగ యువతి, యువకులు న్యాక్ ద్వారా అందించే శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పట్టణంలో ఏర్పాటు చేసిన న్యాక్ శిక్షణ కేంద్రం నిరుద్యోగులకు శిక్షణ అందించడంతో పాటు ఉపాధి కల్పించడంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. స్టేట్ లెవల్ లో శిక్షణ కేంద్రం ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. శిక్షణ కేంద్రం ప్రారంభం నుండి నేటి వరకు టైలరింగ్ లో 281, ఎలక్ట్రీషియన్ లో 523, మేషన్ విభాగం లో 743, ప్లంబర్ విభాగంలో 32, పెయింటర్ విభాగంలో 20 మందికి మొత్తం 1476 మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అందించడం ఆనందంగా ఉందని న్యాక్ డైరెక్టర్ సత్యపాల్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎక్కువ మంది నిరుద్యోగులకు శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 523 మందికి భవన నిర్మాణ విభాగంలో వివిధ వృత్తుల్లో శిక్షణ తీసుకున్న వారికి ధ్రువపత్రాలు, 125 మందికి కుట్టు మిషన్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ కన్నె ప్రేమలత, కన్నె సురేందర్, బోదిరే నర్సయ్య, అజ్మతుల్లా, న్యాక్ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్, న్యాక్ ఇంచార్జి దిలీప్, శ్రీ కృష్ణ, రుచిత, ఓంకార్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement