Tuesday, May 7, 2024

Asian Games – పురుషుల క‌బ‌డ్డీలో గోల్డ్ మెడ‌ల్ – చివ‌రి రోజున ఏకంగా భార‌త్ కు ఆరు ప‌సిడి ప‌త‌కాలు

హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో గోల్డ్‌ మెడల్‌ దక్కింది. భారత్‌, ఇరాన్‌ మెన్స్‌ కబడ్డీ ఫైనల్‌లో భారత్ విజయం సాధించింది. అయితే చివరి నిమిషంలో ఓ రైడ్‌కు సంబంధించి అంపైర్‌ ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దాంతో ఇరు జట్లు అంపైర్‌ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో దాదాపు గంటపాటు ఆట నిలిచిపోయింది. జ్యూరీ జోక్యంతో గంట విరామం తర్వాత ఆట మొదలైంది. ఒక సక్సెస్‌ఫుల్‌ రైడ్‌, సూపర్‌ టాకిల్‌తో భారత్‌ నాలుగు పాయింట్లు సాధించి 33-29 తేడాతో భారత్‌ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

చివ‌రి రోజైన నేడు భార‌త్ ఏకంగా ఆరు బంగారు ప‌త‌కాల‌ను సాధించింది. క్రికెట్, క‌బడ్డీ మ‌హిళ‌లు,పురుషుల జ‌ట్లు, బ్యాడ్మింట‌న్ మెన్ డ‌బుల్స్ విభాగంలో, ఆర్చ‌రీలో మ‌హిళ‌, పురుషుల విభాగంలోనూ ప‌సిడి ప‌త‌కాలు ద‌క్కాయి..

ఇక చెస్ విభాగంలో పురుషులు,మ‌హిళ‌ల జ‌ట్లు వెండి ప‌త‌కాల‌తో మెరిశారు..

ఇదిలావుంటే ఉమెన్స్‌ హాకీలో కూడా భారత్‌కు కాంస్యం దక్కింది. బ్రాంజ్‌ మెడల్‌ పోరులో జపాన్‌ను ఓడించి భారత్‌ కాంస్యం గెలిచింది.

రెజ్లింగ్ 86 కెజీల విభాగంలో దీపక్ పూనియా వెండి పతకం సాధించాడు.

- Advertisement -

మెన్స్‌ కబడ్డీ గోల్డ్‌తో కలిపి భారత్‌ ఈ ఆసియా క్రీడల్లో మొత్తం 103 పతకాలు సాధించినట్లయ్యింది. అందులో 28 బంగారు పతకాలు, 35 రజత పతకాలు, 45 కాంస్య పతకాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement