Thursday, April 25, 2024

NZB: చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి… ఇందూరులో నటి శ్రీముఖి సందడి..

నిజామాబాద్, మార్చి 27 (ప్రభ న్యూస్) : చిన్ననాటి జ్ఞాపకాలు, మిత్రులతో కలిసి పాఠశాలకు వెళ్ళిన రోజులు గుర్తుకొస్తున్నాయని సినీనటి యాంకర్ శ్రీముఖి తెలిపారు. ఇందూరుతో విడదీయని అనుబంధం ఉందని అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సినీనటి యాంకర్ శ్రీముఖి సందడి చేసింది. బుధవారం నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీముఖి హాజరు కావడంతో అభిమానులు సెల్ఫీ దిగడానికి పోటెత్తారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీముఖి మాట్లాడుతూ… నా బాల్యం అంతా ఇందూర్ లోనే గడిచిందన్నారు. పుట్టి, పెరిగిన ఈ ఊరిలోనే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ సోమ నాగరాజు డైరెక్టర్ స్ట్రాటజీ & ప్లానింగ్, సుహాస్, మార్కెటింగ్ డైరెక్టర్ సుదీప్ నల్లచెరు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement