Sunday, April 28, 2024

ఈడీ పేరిట బీజేపీ కక్ష పూరిత ధోరణి : ఎమ్మెల్యే షకీల్

బోధన్ లో ఘనంగా మహిళా దినోత్సవం.. 17 కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేత
నిజాంబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గ కేంద్రంలో జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలో మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని మహిళా మండల్ ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో ఘనంగా సన్మానించారు. భారత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనని మహిళా సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో ఎంతోమంది మహిళా మణులకు రాజకీయంగా పెద్దపీట వేశామన్నారు. దేశం ఏ ప్రాంతమైన సుభిక్షంగా ఉండాలంటే మహిళా మనుల తోడ్పాటు ఎంతో అవసరం అన్నారు. గతంలో ఆడపిల్లలు చేసేందుకు ఎంతోమంది పేద కుటుంబాల వారు ఇబ్బందులకు గురై అప్పుల పాలయ్యారని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలలో అమలు చేయడంతో ఆడపిల్లలకు ఎంతో ఆదరణ లభించిందన్నారు. మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్య మహిళా దినోత్సవం గా నేటి రోజులు తెరాస ప్రభుత్వం ప్రకటించిన విషయం పూర్తి చేశారు. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఉచిత పరీక్షలు ఉచిత మందులను ప్రభుత్వం అందించనున్నావని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బోధన్ నియోజకవర్గం లోని మహిళలకు వివిధ సంఘాల ద్వారా సుమారు 17 కోట్ల వడ్డీ లేని రుణాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా మహిళా సంఘాల వారికి అందజేశారు. ప్రతి గ్రామంలో మహిళా సమాఖ్య భవనానికి 10 లక్షల రూపాయలు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈడీ పేరిట బీజేపీ కక్ష పూరిత ధోరణి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీజేపీ యేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈడి పేరిట కక్షపూరిత కేసులు నమోదు చేస్తూ భయానికి గురిచేయడం ఎంతవరకు సబబు అని బోధన్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. తమ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత ఎదుగుదలను, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు లభిస్తున్న ఆదరణను ఓర్చుకోలేక కేంద్ర ప్రభుత్వం కవితపై కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని కుట్రపూరిత ధోరణి అవలంబించడం పట్ల బోధన్ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుము పద్మ శరత్ రెడ్డి, ఎంపీపీ బుద్దే సావిత్రి, ఆర్డీవో రాజేశ్వర్, ఏసిపి కిరణ్ కుమార్, మహిళా నాయకురాలు అయేషా ఫాతిమా, సునీత దేశాయ్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, సిడిపిఓ ఝాన్సీ రాణి, ఏపీఎం వినోద, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రాణి, మున్సిపల్ కమిషనర్ కమార్ హైమత్, పట్టణ సీఐ ప్రేమ్ కుమార్, పలువురు మహిళా ప్రజాప్రతినిధులు తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement