Sunday, May 5, 2024

NZB | కుక్కను ఢీకొట్టిన బైకు.. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మద్నూర్ , (ప్రభ న్యూస్): కామారెడ్డి జిల్లాలో యాక్సిడెంట్​ జరిగింది. మద్నూర్ మండలం పెద్దగుల్ల గ్రామానికి చెందిన సంతోష్, బిచ్కుంద నుండి మద్నూర్ వైపు టూవీలర్ పై వెళ్తుండగా పెద్ద ఏ క్లారా గేటు వద్ద కుక్కకు ఢీకొట్టాడు. దీంతో బైకుపై నుంచి కిందపడి తలకు గాయమైంది. అక్కడికక్కడే మృతి చెందినట్లుగా ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement