Wednesday, May 1, 2024

Nizamabad – కేంద్ర పథకాలు వంద శాతం వినియోగించుకోవాలి – ఎం.పీ ధర్మపురి అరవింద్

నిజామాబాద్ సిటీ జనవరి (ప్రభ న్యూస్)7: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వంద శాతం లబ్ధిదారులు వినియోగిం చుకోవాలని ఎం.పీ ధర్మపురి అరవింద్ సూచించారు. ఈ పథకా లను పట్టణ,గ్రామ గ్రామాన వికసిత్ భారత్ సంకల్పయాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ బృహత్తర కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఆదివారం దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని దీంట్లో భాగంగా జిల్లా కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మ గుట్ట లో వికసిత్ భార త్ సంకల్ప యాత్ర కార్యక్ర మానికి ఎం.పీ ధర్మపురి అరవిం ద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వంద శాతం లబ్ధి దారు లకు అందించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 2047 నాటి కి దేశాన్ని వికసిత్ భారత్ గా అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరం పనిచే ద్దామని, అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సూచించారు. పుట్టిన బిడ్డ నుంచి గర్భవతులు బాలింతలకు పోషణ అభియాన్, వ్యవసాయపరంగా నూతన టెక్నాలజీ ని ఉపయోగిస్తూ డ్రోన్ ఉపయోగించి అధిక దిగుబడులను పొందేందుకు అవకాశం ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.

అలాగే సర్వే కార్యక్రమాల్లో ఆధునిక టెక్నాలజీ ఐటి పరంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ యూపీఐ ల ద్వారా నేరుగా అర్హులైన లబ్ధి ని అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. పి.ఎం జీవన్ భీమ పథకంలో సంవత్సరానికి కేవలం 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాద బీమా అందుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియని వారికి వాటిని వినియోగించుకో కుండా మిగిలిపోయిన వారికి పథకాలు అందించడానికి ఓ పండుగలా వికసికత్ భారత సంకల్ప యాత్రను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వ పథకాలైన పి.ఎం.జె.ఏ.వై ప్రధానమంత్రి కిసాన్ సన్మానన్, ఉజ్వల, జన్ధన్ యోజన తదితర కేంద్ర పథకాలను ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీసర్ ధర్మ నాయక్, డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ యు. నాగ శ్రీనివాసరావు, ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, స్థానిక కార్పొరేటర్, బిజెపి రాష్ట్ర నాయకులు న్యాలం రాజు, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, బిజెపి పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement