Wednesday, May 8, 2024

Nizamabad – ఐదు రాష్ట్రాలలో కాంగ్రెస్ కు పట్టం – రాబర్ట్ వాద్రా

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)1: ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజల తీర్పును శిరసావ హించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ రాబర్ట్. వాద్రా ఆన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని ఎన్ ఆర్ఐ ఓవర్సీస్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు డిచ్ పల్లి రాజేందర్, ఓవర్సీస్ ఎన్ఆర్ఐ మాజీ ఉపాధ్యక్షులు నరాల కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహిం చిన కార్యక్రమానికి రాబర్ట్ వాద్రా ముఖ్య అతిథిగా హాజర య్యారు. జిల్లా కేంద్రం లోని సారంగాపూర్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత గాంధీ చౌక్ లోని కచ్చియాన్ మజీద్ లో ప్రత్యేక ప్రార్థనలు చేసి పెళ్లి జంటను ఆశీర్వదిం చారు. అనంతరం గాంధీ విగ్రహాన్నికి పూలమాలలు వేసి తర్వాత బాలసదన్ లో విద్యార్థినిలతో సరదాగా గడిపి దుస్తులు పంపి ణీ చేశారు.

ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లా డుతూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక చారిత్రాత్మక కట్టడాల సందర్శ నలో భాగంగా జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. అతి పురాతనమైన, చారిత్రా త్మక ఆలయమైన సారం గాపూర్ హనుమాన్ ఆల యాన్ని సందర్శించి అక్కడ ఆలయ విశిష్ఠను తెలుసుకొని ఆల యంలో ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు . తెలం గాణ రాష్ట్ర ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందన్నారు. ప్రజలు మార్పు కోరుతున్నారని ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలు నిర్ణయించు కున్నారని తెలిపారు.

రాబోయే లోకసభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని వెల్లడిం చారు. తాను క్రియాశీల రాజకీ యా ల్లోకి రావడానికి కొంత సమ యం పడుతుందని పేర్కొ న్నారు. అదే విధంగా సేవే పర మావధిగా ట్రస్టు అధ్వర్యంలో సేవా కార్యక్ర మాల్లో ముందుంటానని అన్నా రు. దేశ ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవ వేణు, పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, రామర్తి గోపి, సయ్యద్ కైసర్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement