Tuesday, October 8, 2024

Trailor – ప్రభాస్ ‘ సలార్ ‘ ట్రైలర్ రిలీజ్

YouTube video

సలార్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కెజిఎఫ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ .. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు ఇక ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది .

దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో విడదీయలేని స్నేహముండేది..అంటూ సాగే డైలాగ్స్‌ షురూ అయింది ట్రైలర్‌. నీ కోసం ఎరైనా అవుతా.. సొరైనా అవుతానంటూ.. సలార్‌కు స్నేహితుడికి మధ్య వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. నేనుండగా నా కొడుకు వరదరాజమన్నార్‌ను దొరగా చూడాలనేదే నా కోరిక అంటున్నాడు జగ్గూభాయ్‌.

కేజీఎఫ్‌ తరహాలో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, హీరో ఎలివేషన్‌, యాక్షన్ సీన్లు, విజువల్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి 3.47 సెకన్ల నిడివి గల ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రశాంత్‌ నీల్‌ ఈ సారి మాత్రం కేజీఎఫ్‌ ప్రాంఛైజీని తలదన్నేలా ట్రైలర్‌ను కట్‌ చేసి ప్రభాస్‌ లెవల్‌ మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు.

ప్రశాంత్‌ నీల్‌ ఈ సారి అంతర్జాతీయ మాఫియా చుట్టూ తిరిగే కథాంశంతో సలార్‌ను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది.ఇక ఈ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. తెలుగుతో పాటు మరో నాలుగు బాషల్లో సలార్‌ విడుదల కానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement