Saturday, October 12, 2024

Nizamabad – త‌ల్లిని గెంటివేసిన కొడుకులు … అక్కున చేర్చుకుని ఆశ్ర‌యం ఇచ్చిన ఖాకీలు

నిజ‌మాబాద్ – నవమాసాలు నొప్పులు భరిస్తూ బిడ్డలను కంటుంది తల్లి.. అక్కడితోనే అయిపోదు తమ బిడ్డలు తమకాళ్లపై తాము నిలబడే వరకు.. ఎన్నో కష్టనష్టాలు భరిస్తుంది. అయితే తమ కోసం అంత త్యాగం చేసిన తల్లిని పువ్వుల్లో పెట్టుకొని చూడాల్సిన కొడుకులు… తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేసి సభ్య సమాజం తలదిం చుకోనెలా చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసు కుంది.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రీ నగర్ కు చెందిన లక్ష్మీ కి ఇద్దరు కుమా రులు ఉన్నారు. కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడు కోవాల్సిన కొడుకు లు కన్నతల్లి భారమై..వృద్ధాప్యం లో రోడ్డుపై గెంటేసారు. దీంతో న్యాయం చేయాలంటూ శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లి ఫిర్యాదు చేసింది. చివరకు దిక్కుతోచని స్థితిలో ఎటు పోవాలో తెలియక గాయత్రి నగర్ లో గల సిద్ధి వినాయక ఆలయం పరిసర ప్రాంతంలో జీవనం గడుపుతోంది…

కాగా, మానవత్వం మరచి ఇంట్లో నుంచి గెంటివేసిన సమాచారం అందుకున్న పట్టణ సీఐ నరహ రి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంజీవ్… వారి సిబ్బంది ఏఎస్ఐ నరసిం హులు కానిస్టేబుల్ సాయన్న వెంటనే ఆ వృద్దురాలికి భోజ నం పెట్టి, ఆశ్రయం కల్పించా రు. అంతే కాకుండా సదరు వృద్ధ మహిళను సఖి సెంటర్ లో ఆశ్రయం కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వారి కొడు కులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని వినని యెడల వారి మీద సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి కోర్టు యందు హాజరు పరుస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement