Tuesday, October 8, 2024

Nizamabad – అనుబంధాల‌కే మాయనిమ‌చ్చ‌…క‌న్న‌త‌ల్లిని గెంటేసిన క‌సాయిలు

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ (ప్రభ న్యూస్) 23: నవమాసాలు నొప్పులు భరిస్తూ బిడ్డలను కంటుంది తల్లి.. అక్కడితోనే అయిపోదు తమ బిడ్డలు తమకాళ్లపై తాము నిలబడే వరకు.. ఎన్నో కష్టనష్టాలు భరిస్తుంది. అయితే తమ కోసం అంత త్యాగం చేసిన తల్లిని పువ్వుల్లో పెట్టుకొని చూడాల్సిన కొడుకులు… తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేసి సభ్య సమాజం తలదిం చుకోనెలా చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసు కుంది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రీ నగర్ కు చెందిన లక్ష్మీ కి ఇద్దరు కుమా రులు ఉన్నారు. కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడు కోవాల్సిన కొడుకు లు కన్నతల్లి భారమై..వృద్ధాప్యం లో రోడ్డుపై గెంటేసారు. దీంతో న్యాయం చేయాలంటూ శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లి ఫిర్యాదు చేసింది. చివరకు దిక్కుతోచని స్థితిలో ఎటు పోవాలో తెలియక గాయత్రి నగర్ లో గల సిద్ధి వినాయక ఆలయం పరిసర ప్రాంతంలో జీవనం గడుపుతోంది… వృద్ధాప్యంలో ఆ తల్లి అవస్థలు చూస్తే ఎవరికైనా కంట నీరు రావాల్సిందే… కసాయి కొడుకుల పై చర్యలు తీసుకొని ఆ కన్నతల్లి కష్టం తీర్చేలా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement