Monday, April 29, 2024

నిజ‌మాబాద్ లో ప్ర‌శాంతంగా ఓటింగ్.. ఓటు హ‌క్కు వినియోగించుకున్న ప్ర‌ముఖులు

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ అర్బన్ లో అభ్య ర్థులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్ లోని ఏఎంసి కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో బిజెపి అర్బన్ అభ్యర్థి దన్ పాల్ సూర్య నారాయణ, నగరంలోని గంగాస్తాన్ లోని ఎస్సార్ డీజీ పోలింగ్ కేంద్రంలో అర్బన్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ బిగాల లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు

నిజామాబాద్ లో ఈవీఎంల మోరాయింపు…

నిజామాబాద్ లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమ యింది. గురువారం నగరంలో లో మాత్రం కొన్ని చోట్ల పోలింగ్ మందకొడిగా సాగుతుం ది.ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు, ప్రజాప్ర తినిధులు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. కొన్ని చోట్ల ఈవీ ఎంలు పనిచేయకపోవడంతో సాంకేతిక సిబ్బంది వచ్చి వాటిని సరిచేసే పనిలో పడ్డా రు. ఈవీఎంలు మొరా యించడంతో ఓటర్లు అసహనానికి గురై అధికా రులపై మండిపడ్డారు. నిజామాబాద్ అర్బన్ లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.

నిజామాబాద్ జిల్లాలో 2 గంటల్లో పోలింగ్ శాతం

నిజామాబాద్ జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం ఇలా.. నిజామాబాద్ అర్బన్లో 6.82 శాతం, నిజామాబాద్ రూరల్లో 8.74 శాతం, బాల్కొండలో 7.3శాతం, ఆర్మూర్లో 8 శాతం, బోధన్లో 14.29 శాతం, బాన్సువాడలో 13.36 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలి పారు. కాగా కొన్ని నియోజక వర్గాల్లో పోలింగ్ మందకోడిగా

- Advertisement -

రావుట్లలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి…

సిరికొండ, : నిజామాబాదు రూరల్ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికలో బరిలో నిలిచిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం. సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో తన ఓటు వేశారు .
అనంతరం గోవర్ధన్ విలేకర్లతో మాట్లాడుతూ, తాను పుట్టింది రావుట్ల గ్రామంలో తన తాతలు పుట్టి పెరిగింది ఈ గ్రామంలోనే.
కాని మా నాన్న చిమన్ పల్లి గ్రామానికి వెళ్లారు. తాను చిమన్ పల్లి గ్రామానికి పోలీస్ పటేలుగా,సర్పంచుగా ఉన్నాను. క తనకు విశ్వాసం మేరకు. తనతో పాటు తన వినోద,పెద్ద కుమారుడు జగన్, కోడళ్ల ఓటు కూడ రావువట్ల గ్రామంలో నమోదు చేసుకున్నాట్లు గోవర్ధన్ చెప్పారు. ఓటింగ్ నియోజకవర్గంలో ఓటింగ్ సరలిని పరిశీలిస్తే ప్రజలు కారు గుర్తుకు ఓటు వేస్తున్నట్లు తెలిసింది. గత ఎన్నికల కంటే ఈ సారో మరింత మెజారిటీతో విజయం సాధిస్తానని గోవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు.

సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement